1940వ సంవత్సరములో గుంటూరు మేత్రాసనము న్వదేశ గురువులకు ఒసగ బడినప్పటి నుండి మరియు తాళ్ళచెరువు గ్రామములో సిస్టర్హు 13-01-1941న కాన్వెంటు, ప్రాథమిక పాఠశాల నిర్వహించుట ప్రారంభం నుండి గ్రామ ప్రజలలో మార్పు కన్పించింది. వారి జీవన,ఆలోచన విధానంలోను, విద్యారంగములోను స్పష్టమైన మలుపు పుంజుకొన్నది. 02-04-1952న గ్రామములో పోష్టాఫీసు స్టాపించటంతో రోజువారి వార్త పత్రికలు రావటము, చదవటము మొదలైంది. అంతకుపూర్వము నుండి గ్రామ మనసబ్‌గారే పంచాయితీ సర్‌పంచ్‌గా నామమాత్రము పని చేయుచున్న పద్దతి మారి ‘ పంచాయతి ఎన్నికల పద్దతి ద్వారా సర్పంచ్‌లను, మెంబర్లను ఎన్నుకొనుట జరిగింది. ఈ మార్పులవల్ల గ్రామ ప్రజలు గ్రామ అభివృద్ది కార్యక్రమాలను చేపట్టే సర్పంచ్‌లను ఎన్నుకొనుట జరిగింది. సర్పంచ్‌లు గ్రామాభివృద్ది కొజకు, రోడ్డువేయించుట, ముఖ్యముగ తాళ్ళచెరువు అచ్చమ్మపేట రోడ్డును ప్రజలే స్వయముగ నిర్మించుకొని 1973లో బస్సు సౌకర్యము ఏర్పరచుకొనుట జరిగింది. అదే
విధముగ ప్రజల శ్రమదాన సహకారముతో 1973లోనే గ్రామానికి కరంటు సదుపాయము ఏర్పటు చేసుకొనుట జరిగింది.09-03-1958 నుండి తాళ్ళచెరువు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్‌ స్టాపించటము జరిగింది. దీని ద్యారా వ్యవసాయదారుల సహాయాన్ని పొందుట జరుగుతుంది. మరియు 1975లో సిస్టర్లు డిస్పెన్సరి స్ట్థాపించటం, దాని వలన ప్రజల ఆరోగ్యస్టీతి మెరుగు పడటం జరిగింది. 1976లో మాదిగపల్లిలో ప్రత్యేకముగ వారి పిల్లల కొటకు ప్రాథమిక వాఠశాల ప్రారంభించటము, దాని వలన వెనుకబడిన ఆ ప్రాంతపు పిల్లలు బాగుగా బడికి రావటము, తరువాత హైస్కూలు చదువులు, కాలేజి చదువులు కూడ చదవటం జరుగుచున్నది.

ది.21-02-1976న గ్రామములో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘము స్థాపించారు… దిని వలన పేద, సన్నకారు, మధ్యతరగతుల ప్రజలకు అదనపు ఆర్థిక సహాయము పొందే అవకాశము కలిగింది. అనేక మంది లబ్టిపొందుచున్నారు. 15-08-1980న ఈ సంఘము ప్రత్యేక స్వంత భవనము నిర్మించుకొనుట మరియు దానిపై ది.15-08-1990 మొదటీ అంతస్తు కూడ వేయుట జరిగింది. 1995వ సంవత్సరములో రెండవ వాల ఉత్పత్తి సంఘం కూడ ఏర్పడింది. గుంటూరు జిల్లాలో తాళ్ళచెరువు గ్రామము పాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నది. పంచాయతీ సర్‌పంచ్‌లు శ్రద్ద తీసికొని పేదప్రజలకు ఇండ్ల స్థలాలకు కాలనీలు ఏర్పరచటము, తదుపరి ప్రభుత్వ, లబ్దిదారుల సహకారముతో చాలమందికి గ్భుహాలు నిర్మించడం జరిగింది. గ్రామంలో మేత్రాసన పొలములో పంచాయతీ స్వంత బిల్లింగు 07-05-1985న నిర్మించటము జరిగింది. అచ్చటే మరల మంచినీళ్ళు గ్రామానికి సబ్రయి చేయుటకు ఓవర్‌ హెడ్‌ నిళ్ళటాంకు నిర్మించటము జరిగింది. ఆ ప్రదేశములోనే రక్షిత మంచినీటి పథకం ప్రకారము, కృష్ణా నది జలాలను నిల్వచేయుటకు. బావులు తీయుట కూడా జరిగింది. ఈ పథకానికి మేత్రాసన సహాయం కూడాలభించింది. దానికి ముందే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కొరకు ఆ స్టలముల్‌నే బిల్లింగు 1992లో నిర్మించారు. 30-08-1993లో జ్యోతిర్మయి మహిళా మండలము, మరియు ఆదర్శ మహిళా మండలములు ఏర్పడినవి.ఈవిధముగా అనేక అభివృద్ది పథకాలను అమలు పరచారు.

తాళ్ళచెళువు గ్రామము సాగరు పంట కాలువల చివరి భాగములో ఉండుట వలన మొదటి, రెండు, మూడు సంవత్సరములు తప్పు తరువాత పైర్లకు నీళ్ళు అందటం లేదు. వర్షాలు కురిసిన రోజు మాత్రం ఎవరికి అవసరము లేనప్పుడు కాలువ నీళ్ళు వ వస్తాయి. దీని వలన రైతులు చాలా ఇబ్బంది పడుచున్నారు. గ్రామములో వరి మాగాణి నీళ్ళు లేక నాటుట లేదు. ఇది చాలా దారుణము. ప్రత్తి మిర్చి మెట్ట పంటలు వేయుచున్నారు.ఎటికి కాలువ నీళ్ళురావు. రైతులు స్వంతముగా తమ పొలాలలో బావులు త్రవ్వించడం, బోరులు వేయించడం జరుగుతుంది. తాళ్ళచెరువు ప్రజలు కష్టజీవులు ప్రత్తి మిర్చి పండించుటలో _ జిల్లాలో ప్రథమ బహుమతులు పొందారు. వారికి ప్రభుత్వ నీటి వనరులుసమకూరిస్తే, ఇపుడు బంగారం పండిస్తున్నారు. అపుడు వజ్రాలు పండంచుదురు. పులిచింత ప్రాజెక్ట్‌ వచ్చినా, తాళ్ళచెరువు పొలలకు నీళ్ళురావు. ఎందుకన, కొండలు అడ్డమున్నవి. కాబట్టి మిగిలినది ఒక్కటే మార్గము, కృష్ణానది నుండి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకము. ప్రభుత్వము తాళ్ళచెరువుకు ఈ సహాయం చేస్తే చుట్టు ప్రక్కల గ్రామాల వారు కూడా లాభం పొందుతారు. ఒకరోజు ఈ పథకం అమలు జరుగుతుందని ఆశిద్దాం, ప్రార్రిద్దాం, ప్రయత్నింద్దాం.

గ్రామములో 13-06-1983న హైస్కూలు పెట్టినప్పటి నుండి అత్యధిక సంఖ్యలో చదువుచున్నారు. తరువాత కాలేజి చదువులు కొనసాగించు చున్నారు. ఈ హైస్కూలు గ్రామానికి ఒక నిధి వంటిది. హైస్కూలు మొదట పెట్టినపుటి నుండి 7వ తరగతి పరీక్ష ఫలితాలు దాదాపు ప్రతి సంవత్సరము నూరు శాతము వస్తున్నవి. అదే విధముగ 10వ తరగతి పరీక్ష ఫలితాలు కూడ చుట్టు ప్రక్కల హైస్కూళ్ళలో రానంత ఎక్కువ ఫలితాలు సాధించ గలుగుచున్నారు. మరియు ఆటల పోటీలలో కూడ ఇతర స్కూళ్ళకు తీసిపోరు. ఇది అంతకూడ సిస్టర్త టీచర్ల ముఖ్యముగా విద్యార్థినీ, విద్యార్దుల కృషి ఫలితం. వీరెంతో అభినందనీయులు. విరి సేవ మరువ రానిది. ఈ గ్రామానికి ఇంత ప్రతిభను తెచ్చిన వారిని గ్రామస్తులెన్నడు మరువరాదు. తాళ్ళచెరువు ప్రజలను, పిల్లలను తక్కువ అంచనా వేసి హీనముగా మాట్లాడిన వారినోళ్ళుమూత పడ్డవి. అయితే ప్రస్తుతము హైస్కూలు చదువులు చాలవు. కనీసము జూనియర్‌ కాలేజీకి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం పురుష లక్షణం. పట్టుదల వుంటే
మానవుడు దైవ సహకారంతో సాధించలేనిదంటూ వుండదు.

ఇంకోక విషయం చదువు కేవలం ఉద్యోగముల కొజకు అని భావించరాదు. ఆ రోజులు పోయినవి. ప్రతి ఒక్క పనికి ఇప్పుడు చదువు అవసరము. తాళ్ళచెరువులో ఇప్పుడు చాలమంది డిగ్రీ హోల్డర్దు, యం. ఎ. లు చదివినవారు ఉన్నారు. చాల సంతోషము. ఇంజనిర్జు, డాక్టర్లు కూడ ఇప్పుడు పనికి రావటము లేదు. క్రొత్త సాంకేతిక చదువులు చదవాలి.స్వంతగా ఏదైనా ఏర్పాటు చేసికోవాల్సిన రోజులొచ్చాయి. కొంతమంది ఇప్పుడు వ్యాపారములో ప్రవేశించారు. మంచిది అటువంటివి చూచుకోవాలి.
అలాగే పారిశ్రామిక రంగంలో కూడ ప్రవేశించాలి. అచ్చం వ్యవసాయము మీదే ఆధారపడరాదు. ఆ రోజులు పోయినవి. మారుమూల గ్రామమైనా ఎప్పుటికప్ప్తుడు తాజా సమాచారము అందజేయుటకు 1975 నుండి టెలిఫోన్‌ సౌకర్యములు కూడ ఉన్నవి.

కొంతమంది రాజకీయాలలో ప్రవేశించు చున్నారు… ఇది కూడ ఎంతో అవసరమే. గ్రామం అన్నివిధాల పురోభివృద్ది గాంచుతుంది. అధునాతన పద్దతులలో దాదాపు అన్ని కులాల వారు గృహాలు నిర్మించుకుంటున్నారు.జీవన సవ్రంతి కొనసాగిస్తున్నారు.