ప్రాథమిక విద్యను పూశీ చేసుకొన్న విద్యార్థిని, విద్యార్థుల హైస్కూలు చదువులకు ఫిరంగిపురం, గుంటూరు, రెంటచింతల, పెద్దపరిమి అధిక సంఖ్యలో దూర ప్రదేశాలు వెళ్ళవలసి వచ్చినది. అది అందరికి ముఖ్యముగ పేదవారికి అందుబాటులో లేదు. కొంతమంది పేద పిల్లలు ప్రతిరోజు అచ్చమ్మపేట హైస్కూలుకు నడచివెళ్ళవలసి వచ్చింది. అచ్చమ్మపేటలో సరియైన స్టాండర్జులేదు. ప్రజలలో విద్యయందు ఆసక్తి బాగుగ పెరిగినది. తాళ్ళచెరువులో హైస్కూలు పెడితే అందరు చదువుకొనుటకు అవకాశము కలుగుతుందని ప్రజలలో ఆలోచన కలిగింది. పై నుదహరించిన గ్రామములకు విద్యార్థిని, విద్యార్థులు వెళ్ళినపుడు అందరికి ప్రవేశము దొరికేది కాదు. ముఖ్మముగ ఫిరంగిపురంలో అమ్మగార్జు తాళ్ళచెరువు పిల్లలు అడవివారు, మొద్దులు, చదువురాదు అని హేళనగా పదిమందిలో మాట్లాడేవారు. తాళ్ళచెరువులో మరి ప్రాథమిక పాఠశాలలో పనిచేసేది, మీ అమ్మగార్లేకదా! వారిచ్చిన రికార్డు ఫీట్టులేకదా అని వాదించాల్భివచ్చిది.
ఇది అంత మననం చేసి అప్పుటి విచారణ గురువు ప్రజల విజ్ఞప్తి మేరకు అప్పటి ఏలినవారైన కాగితపు మరియదాసు గారితోను, పెద్ద మదరు మేరిస్టైల్లా గారితోను, స్టానిక సుపీరియర్ గారైన మరియరోస్ గారితో సంప్రదింపులు జరిపి ది. 13-6-1983న ఆరవ తరగతి, తరువాత ప్రతి సంవత్సరము ఒక క్రాసు చొప్పున పెంచుకుంటూ హైస్కూలు ప్రారంభించారు. మొదటి నాలుగు సం॥ ప్రస్తుత ప్రాథమిక పాఠశాలలోను, కొన్ని పూరిషెడ్డు వేసి కష్టపడి పనిచేస్తూ వచ్చారు. విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులే ఫీజుల రూపములో టీచర్హ జీతాలకు సహకరించారు.
సిస్టర్సు పెద్దలను అమాయకులను చేసి గాలిబాలి బిషప్‌గారికి చెప్పకుండా ఆ ఊరి ముందు చేలో రెండు ఎకరములు పోను వున్న ఎ. 5.56 సెంట్ల భూమిని అక్రమ దస్తావేజులో వ్రాయించుకున్నారు. ఆ దస్తావేజు చెల్లదు. గ్రామపెద్దలు అలా వ్రాయుటకు హక్కులేదు. అది మేత్రాసన పొలము. మేత్రానులు వ్రాస్తేనే చెల్లుతుంది. బిషప్పు గారికి ఈ విషయము తెలిసి ప్రశ్నించగ సరిమైన సమాధానము ఎవరు చెప్పలేక పోయినారు.చివరకు పేచీదేనికని ఎకరమున్నర దానిలో గుడికి కావాలని చెప్పినారు.మిగతాది హైస్కూలు క్రింద ఇస్తామన్నారు. ఆ ఎకరమున్నర లోనే గ్రామస్తులు పంచాయితి ఆఫీసు, మంచి నీళ్ళ ట్యాంకు, బావులు, ప్రభుత్వ ఆస్పత్రి బిల్లంగులు కట్టారు.
బిషప్ గాలిబాలి గారి శిఫారసుతో జర శ్రనినుండి వచ్చిన ఆర్థిక సహాయంతో సుపీరియర్ గారైన మరియరోన్ సిస్టరు 9-1-1987లో గాలి బాలి ఏలినవారితో శంఖుస్టాపన చేయించారు 28-10-1987లో బిల్లింగు పూర్తిగావించి అదే బిషప్పుగారితో ప్రారంభో తృవము జరిపించారు. అప్పటి నుండి హైస్కూలు తరగతులు దానిలోనే జరుగు చున్నవి. ఈ విషయములో చాల కస్టపడిన మరియరోస్ అమ్మగారు ప్రశంసనీయులు. 1990 జూన్‌లో సిస్టరు సిల్వియ (తుమ్మ. రాజమ్మ) గారు హైస్కూలు ప్రధానోపాధ్యాయినిగా వచ్చారు. ఇప్పటివరకు 7వ తరగతి 10వ తరగతి పరీక్షాఫలితములు చాల ఆసక్తికరముగ నున్నవి. 1991 మార్చిలో వ్రాసిన 7వ తరగతి, 10వ తరగతి పలితములు 100% వచ్చి అందరిని స్థంభింప చేసింది. అడవివారు,
మోటువారు, మొద్దులు అన్నవారు విస్తుపోయేటట్టు తాళ్ళ చెటువు విద్యార్థినీ, విద్యార్థులు తమ ప్రతిభను చూపించారు. ఆటల పోటీలలో కూడ ఘణనీయమైన విజయాలను సాధించుచున్నారు ఎప్పుడు పరీక్ష ఫలితములు చాలా హైస్టాయిలోనే వచ్చుచున్నవి. అవకాశ ముంటే ఎవరు మొద్దులు, మోటువారు కాదని తాళ్ళచెరువు విద్యార్థినీ విద్యార్థులు నిరూపించుకున్నారు.అనేకమంది విద్యార్థులు చుట్టు ప్రక్క గ్రామముల నుండి వచ్చికూడ తాళ్ళ చెటువులో చదువుకుంటున్నారు.
1991 జూన్‌లో కానుకమేరి సిస్టరుగారు సుపిరియరుగ, కరస్పాండెంట్ . గా వచ్చారు. వీర్రు చాల కృషిచేసి బిషప్పుగారి ఆర్థిక సహాయంతో, మదరు జనరల్ మేరిఇగ్నేషియస్‌లయోల గారి సహాయంతో ఆరు ఎకరముల చుట్టూ ్రహరిగోడ కట్టించి హైస్కూలుకు హుందాతనము తెచ్చారు. బిషప్పుగారి సహాయముతోనే లెట్రిన్సు కట్టించారు. ఇప్పుడు హైస్కూలు సర్వహంగులతో నున్నది. 1995 జూన్ నుండి సిస్టరు. కానుకమేరి ముఖ్యముగా ్రధానో పాధ్యాయిని (తుమ్మారాజమ్మ) సిస్టర్. సిల్వియ అవిరాళకృషివలన, పలువురు పెద్దల సహకారముతో హైస్కూలులో పనిచేసేవారందరికి ప్రభుత్వ జీతాలు వచ్చేటట్టు చేసారు. ఇది ఎంతో శ్రాఘనీయము.1995 ఆగష్టులో సిస్టరు. మార్ల్గరేట్ మేరిగారు హైస్కూలు ప్రధానో పాధ్యాయినిగ వచ్చారు. 1996 జనవరి ఈమె ఆధ్వర్యములో గ్రామస్తుల,పెద్దల సహకారముతో ్రశాంతముగ ప్రతిభా విధముగ నిర్వహించిన జోనల్ ఆటల పోటీలు అందరి మన్ననల నందుకున్నవి.