అర్లానందస్వామి జబ్బుగానున్నపుడే లూయిసుబూట్సు గురువులు సహాయ గురువులుగ పంపబడిరి., అర్దానంద స్వామి మరణానంతరము లూయిసు బూట్సు స్వామి విచారణ గురువులుగా నియమించబడిరి. 1928లో నెల్రూరు మేత్రాసనము ఏర్పడింది. వీరు 10 సం॥లు విచారణ గురువుగ పనిచేసిరి. వీరికాలములో ‘ప్రాంచిసు గ్రోలికరు స్వామి ,తెప్పరమల్లి. మరియన్న, పచ్చాల జోసఫ్‌, గోపు జోసెఫ్‌, డన్‌ గురువులు సహాయ గురువులుగ పనిచేసిరి, వీరి కాలములో ఇంకను అనేక గ్రామములలో. ‘జ్ఞానస్నానము లిచ్చిరి.

లూయిసుబూట్సు

లూయిస్‌ బూట్సు స్వామి 1937లో తాళ్ళచెరువు నుండి ఆఫ్రికాలో పనిచేయుటకు వెళ్ళిరి. అ హాలెండు దేశములో ‘వెకాలో”ని ప్రదేశముల్‌’ ది.08-06-1987న జన్మించి ది. 22-09-1954న మరణించిరి. బూట్సు స్వామి. తరువాత డన్‌ స్కామి విచారణ గురువులైరి. బూట్సు స్వామి కాలములోని మత’ విషయాల యందు కథోలికులకు మంచి స్టరత్యమ్తు కలుగచేసారు.

దురదృష్టవశాత్తు 1935లో పెద్దగాలి వానకు గుడి, బంగళాగా కట్టబడిన భవనము పై ఆంతస్తు, క్రింది గుడి భాగము కుప్పక కూలిపోయినది. దేవాలయము లేని కారణముగ విచారణ గురువు డన్‌స్వామీలు వారు ఇప్పుడున్న దేవాలయ నిర్మాణానికి పునాదులు లేశారు .. ఒక సంవత్సరములోనే వారు గురుత్వం వదలి వెళ్ళిపోయారు. డన్‌స్వామి పేరు వింటేనే గ్రామస్తులు హడలిపోయేవారు. వీరి తరువాత జె. బ్రొక్కన్‌ గురువులు విచారణ గురువులుగ వచ్చారు. వీరు కొంచెము చపల చిత్తులు. వీరి కాలములో పెద్దగ పనులు జరగలేదు. వేసిన దేవాలయపు పునాదులు భూమట్టము లేపారు, ఇంతలో గుంటూరు ప్రత్యేక మేత్రాసనము 1940లో ఏర్పడింది.

గుంటూరు మేత్రాసనము
1940 సంవత్సరము ఫిబ్రవరి 13వ తేది గుంటూరు జిల్లా నెల్లూరు మేత్రాసనము నుండి వేరుచేయబడి గుంటూరు మేత్రాసనముగ రూపొంది స్వదేశ గురువులకు ఒప్పచెప్పబడింది. పొతకమూరి తోమాసు ఏలినవారు ప్రథమ మేత్రాణులుగ నియమించబడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు మేత్రాసననే మొట్టమొదటి స్వదేశీయ మేత్రాసనము. దీనితో గుంటూరు మేత్రాసనముతోపాటు తాళ్ళచెరువు కూడ కొత్తదనం సంతరించుకొన్నది.

1940 జూన్‌ మాసము నుండి 1952 జూన్‌ వరకు తిప్పరమల్దీ మరియన్ను స్వామి విచారణ కర్తలుగ పనిచేసినారు. మొదలు పెట్టిన దేవలయ నిర్మాణము కొనసాగించారు. ఆ రోజులలో ఇతర దేశాల నుండి ఆర్డిక సహాయము చాల తక్కువ. రైతులే ఎకరాల ప్రకారము చందాలు వేసికొని సహాయ పడ్డారు. శ్రమ దానము చేశారు. ఎల్లారెడ్డి కుంటలో ఇటుకలు కాల్పించారు. వీటన్నిటికి ప్రజా సహాయము ఎంతో ‘ఉత్సాహముగ లభించింది. రెంటచింతల నుండి పెద్ద మేస్త్రి యాటగిరి (బోయ) శౌరయ్య గారి ఆధ్వర్యములో స్థానిక చిన్నమేస్త్రిలతో ముఖ్యముగ అవ్వారి రాయన్న గారితో దేవాలయ నిర్మాణము నుంది కూలీలతో మిగతా పని శ్రమదానముతో సాగింది. ఈ దేవలయ నిర్మాణములో తిప్పరమల్టీ మరియన్న స్వామి శక్తి వంచనలేక కావలసిన డబ్బు తమకు తెలిసిన ప్రతి ఒక్కరి నుండి విరాళములు పొంది నిదానముగ 10 సంవత్సరాల కాలములో ఇంత బ్రహ్మాండముగ, ఆకర్షణయమైన దేవాలయాన్ని పూర్తిచేసారు. తొలుత దేవాలయ కప్పు సీమ పెంకులతో వేయబడింది. -ఈ కప్పుకు పొతకమూరి తోమాసు ఏలినవారు 1943లో బెంగుళూరు బదిలీయైనప్పటికి ఆర్థిక సహాయము చేసారు. ఈ పెంకులను తాళ్ళచెరువు రేతులే తమ ఎడ్డల బండ్లతో నర్సరావుసేట నుండి తరలించడం జరిగింది,

1943 అక్టోబరు 28న గుంటూరు మేత్రాణులుగ ముమ్మడి’ ఇన్నేషియస్‌గారు. ఫిరంగిపురంలో అభిషిక్తులైరి. 1941 జనవరి 13న ఫిరంగిపురం పునీత అన్నమ్మగారి మఠానికి చెందిన సిస్టర్సుకు క్రితము నుండి నడుపబడుతున్న ప్రాథమిక పాఠశాలను ఇవ్వడమైనది. అప్పటి నుండి విద్య గ్రామములో ప్రత్యేకత పుంజుకుంది. గ్రామస్తులు, భక్తి, విశ్వాసములు, నాగరికత, ఆరోగ్య పద్దతులు నేర్చుకున్నారు.

దేవాలయ నిర్మాణానికి కావలసిన గులకరాళ్ళు పిల్లలు పొలాల్లో ప్రోగుచేసి బండ్లతో తోలేవారు.. గానుగ సున్నము బొచ్చలతో మోసేవారు. పిల్లలు కూడ ఉడతా భక్తితో తమవంతు శ్రమదానము చేసారు. పెద్ద పెద్ద రాళ్ళతో నిర్మింపబడిన దేవాలయానికి కావలసిన రాళ్ళు పిరంగిపురం నుండి రాళ్ళు కొట్టేవారిని రప్పించి పిల్లిగుండ్లలో రాళ్ళు కొడితే బండ్లతో రైతులు తోలగ మరల వాటిని మలచేవారు. పడిదరం నుండి మసాను సాహెబ్‌ గారు వచ్చి వడ్రంగపు పనిచేసేవారు. ఈ పౌరుగూరు మేస్త్రీలకు వారానికి ఒక యింటి వద్ద ప్రజలే భోజనము ఉచితముగ పెట్టేవారు ఆరోజులలో జొన్న, సజ్జ, వరిగ అన్నాలే. చింతకాయ పచ్చడి, గోంగూర, పప్పు ఇవి కూరలు. అదే విధముగ మేస్త్రీలు కూడ ఎవరు ఎటువంటి భోజనము పెట్టిన గొనగకుండ తిని తాము తిండి, డబ్బు కొణికు పనిచేయుటలేదు అన్నట్లు -ఈ దేవకార్యాన్ని ఎలాగైనా గట్టెక్కించి తీరాలని కృషి , త్యాగము చేసి పూర్తిచేసారు , విరందరిని మసనమప్ప్రడు మరువరాదు. డబ్బుకొరత వలన దేవలయ నిర్మాణము ఇంతకాలం పట్టింది.

దేవాలయమoతా తృప్తిగ పూర్తి అయిన సిమ్మట 1952 జనవరి 15 తేది బెంగుళూరు నుండి సొతకమూరి ఎలినవారు విచ్చేసి గుంటూరు మేత్రాణులులతోసాటు అనేకమంది గురువుల, కన్యా(స్త్రీల, బంధుమిత్రులతో పతనమైన బాలయేసు దేవాలయము పేరుతోనే ఎంతో ఘనముగ ప్రతిష్టోత్సవాన్ని జరిపారు. ఆ దినము తాళ్ళచెరువు చరిత్రలో మరపురాని దినం.

మరియన్న స్వామి ప్రయత్నము వలన తాళ్ళచెరువుకు ది. 02-04-1952 న పోష్టాఫీసువచ్చింది. మరియన్న స్వామి జూన్‌ 1952 నుండి శిరిపురం, కొన్ని సంవత్సరముల తరువాత అచ్చట నుండి కనపర్రు, తదుపరి మేళ్ళవాగు-రెడ్డిపాలెంలో వృద్దాప్యము వరకు పనిచేసి, నల్లపాడు వృద్ద గురువుల వసతి గృహంలో చేరిది.20-01-1996న తన 93వ యేట పరలోక ప్రాప్తి నొందిరి. స్వగ్రామమైన ఫిరంగిపురంలో ది. 21-01-1996న దేవమాత గృహ వద్ద భూ స్టాపితము చేయబడిరి. వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి కొజకు తాళ్ళచెరువు కథోలికులు ప్రత్యేకముగ ప్రార్ధింప బుణపడియున్నారు. తరువాత గొలమారి రాయన్న స్వామి విచారణ గురువుగ వచ్చి జనవరి 1955 వరకు పని చేసిరి. తరువాత హెచ్‌. హెగన్రిక్స్‌ స్వామి జూన్‌ 1957 వరకు పని చేసినారు. వీరి కాలములో ప్రస్తుతమున్న లూర్జ్హుమాత గృహను యేరువ ఇన్నారెడ్డి (కక్కయ్య) గారి విరాళముతో నిర్మించినారు.
వీరికి తెలుగు సరిగరాదు. బెల్జియం దేశస్తులు. తాళ్ళచెరువులో మొదట నుండి పిల్లలు ఎక్కువ. ఇది మంచి (మొరాలిటికీ) నీతికి సూచన. అది దేవుని ఆశీర్యాదము అనేవారు హెన్రిక్స్‌ స్వామి.