సరియైన విశ్రాంతి, నిద్ర ఆహారములు లేక, సరిపడని వాతావరణము లో, వసతిలేక ఆహర్నిశలు ఈ పేద ప్రజల శ్రేయస్సే తన శ్రేయస్సుగా భావించి, వారిలో ఒకరిగా సహ జీవనము చేస్తూ అష్టకష్టాలు పడి చివరికి తన ఆరోగ్యాన్ని కోల్పోయి, ఆరిక పరిస్థితి తరిగిపోయి తప్పనిసరిగా ఇవి మరల పుంజుకొనుటకు తమ మాత్పదేశము వెళ్ళవలసి 1905 సంవత్సరములో వెళ్ళారు. వారులేని కాలములో 1905 సంవత్సరములో జె.కిట్ స్వాముల వారిని, 1906-1907 సంవత్సరములో జి .రాట్‌గర్ స్వాములవారిని నియమించారు. స్వదేశము నుండి తిరిగివచ్చిన అర్లానంద స్వాముల వారిని తాళ్ళచెరువుకు పంపకుండ ప్రస్తుతము ప్రకాశము బిల్దాలో వున్న జీడిపప్తుకు పేరు బడసిన వేటపాలెంలో కొత్తగా జె.యం.జె సిస్టర్సు మఠము స్టాపించగ అచ్చటికి పంపారు.
ఆ మఠము కొద్ది కాలములొనే మూసివేయబడింది. తాళ్ళచెరువు ప్రజలు అర్లానందస్వామి లేని కాలములో చాల సమస్యలకు గురి అయ్యారు. వారి స్లానములో వచ్చిన గురువులతో తృప్తి పడలేదు. గ్రామస్తులు మరల అర్లానంద స్వాముల వారినే పంపవలసినదిగా అప్పటి మద్రాసు మేత్రాణుల వద్దకు వెళ్ళి వినతి పత్రము సమర్పించారు. మేత్రాణులు ప్రజల అభ్యర్థన ప్రకారము 1908 సంవత్సరములో అర్లానంద స్వాముల వారిని తిరిగి తాళ్ళచెరువు పంపారు, తిరిగి వచ్చిన స్వామిని చూచి తాళ్ళచెరువు ప్రజ ఎంతో ఆనందించారు. వచ్చిన వెంటనే స్వామి ప్రజల సమస్యలన్ని పరిష్కరించారు.
దేవాలయము. గురువులకు వసతిగృహము
ఇప్పటి వరకు ఇచ్చట ఒక దేవాలయమంటూ లేదు. ప్రజలే దేవాలయము. గురువులకు వసతిగృహము లేదు. అర్దానందస్వామి ఈ .రెండు ఒకే భవనములో కట్టుట ప్రారంభించారు. ప్రజలు ఎంతో శ్రమదానము చేసారు. తమ ఎడ్డబండ్లతో ఇసుక, రాయితోలుట, సున్నపు గానుగలు వేయుట మొదలగు తమ వల్లనైన పనులు ఉచితముగా చేసి సహకరించారు. ఇది ప్రస్తుతము వున్న బంగళాయే. అయితే అది రెండస్తుల మేడగ సున్నపు గచ్చుతో కట్టబడింది. క్రంద ఎక్కువ భాగము దేవాలయముగ, పైభాగము మరియు మరికొంత ‘క్రింది భాగము గురువుల వసతి గృహముగ వుండేవి. ఈ భవనము 1910 సంవత్సరములో పూర్తి చేయబడింది. ఈ దేవాలయమునకు బాలయేసు దేవాలయమని అర్హానందస్వామిచే నామకరణము చేయబడింది.

వ్యవసాయ సాధక బాధకములలో, ఆర్థిక, ఆధ్యాత్మిక విషయములందును, రెవిన్యూ అధికారులతోను, అటవీశాఖాధికోరులతోను, పోలీసువారితోను, కోర్టు కేసుల విషయములలోను, ప్రభుత్వాధికారులతోను, ఎప్పటి కప్పుడు ప్రజలందరి అవసరములను తీర్చేవారు. కథోలికేతరులకు కూడ సత్తెనపల్లి తాలుక అన్ని |గ్రామముల నుండి తమ సహాయార్ధమ వచ్చినవారికి, ఏ మతమువారైన, కులమువారైన, ముఖ్యముగ పేదవారికి తమ సలహాలను,సహాయాన్ని అందజేసి మంచి కీర్తిపొందారు, ముఖ్యముగ కోర్టుకేసుల విషయములలో ఆరితేరినారట.
ఆ కాలములో ఎరుకల కులస్తులను ప్రభుత్వము దోపిడి దొంగలుగా గుర్తించి ము(ద్రవేసారు. ఎక్కడ దొంగతనము జరిగిన ఆ కులస్తులను వాకభ్ చేసేవారు. అందుకని ఈ (ప్రాంతపు ఆ కులస్తులందరు ఆ స్వామివారిని ఆశ్రయించి వారి ఆదరణలో వుండేవారని చెప్పుచుందురు. దీనికి తార్కాణముగానే చాల గ్రామములకు చెందిన ఈ కులస్తులు విశ్వాసము లేకపోయినను తమ రక్షణార్హము జ్ఞానస్నానము పొందారు
1916-1917 సంవత్సరములలో తాళ్ళచెరువులో ఎరుకలి, తెలగ,తొగటి, వడ్రె వారంతా జ్ఞానస్నానము. పొంది కొన్ని సంవత్సరములతరువాత వివాహనిబంధనలు తట్టుకోలేక హిందువులుగా మారారు.
తాళ్ళచెరువు చేపట్టినప్పటి నుండే అత్తలూరు, రామపురం, గారపాడు,హుసేన్‌నగరంలో నున్న కథోలిక సంఘాలను సందర్శించేవారు. అప్పుడు ఆ గ్రామాలు తాళ్ళచెరువు విచారణలో వుండేవి, కేవలం తాళ్ళచెరువు వరకే అర్లానందస్వామి తృప్తి పడక పైనుదహరించిన గ్రామాలను చూచుకుoటూ, చాల కస్టపడి ఆరోజుల్లో ప్రస్తుత ప్రయాణ సౌకర్యాలుగాని రహదారులుగాని, లేని కారణమున, కొన్ని సార్లు యడ్డల బండిమీద, కొన్ని సార్లు కాలీనడకసన, అప్పుడప్పుడు గుర్రము మీద ప్రయాణం చేసేవారు .
అర్లానందస్వామి వారు మేత్రాసనము కొరకు కొంత భూమిని కూడ వుంచిరి. ప్రస్తుతము ఈ భూమి మిగిలియున్నది.
- 173 210/1 1,30 ఎల్లారెడ్డి 5 కుంట
2, 121 11 1.94 పాత సమాదుల దొడ్డి - 239 125 1.50 క్రొత్త సమాధుల దొడ్డి
- 237 173 2.60 = గుడి ఆవరణ
- 210 124 2.00 కల్హాలమిట్ట
- 183 108 7,06 మాగాణి
7, 183 200 7,96 మాగాణి
8, 115 112 2,360 మెట్ట
9, 144 164 7,56 ప్రస్తుతము అమ్మగార్ల్హ హైస్కూలు, ఎ.1.50 సెంట్లు మత్రాసనము క్రింద ఉన్నది,
10, 6 210/0 1,1 అడనికి పోయే డొంక,
11 278 199-318/0 3:00
12 82 66 – 2,1 పూజల కొరకు
అయితే శరీర శ్రమ లేకుండా సంపాదించాలనుకున్న వారు రాను రాను ఎక్కువ సంఖ్యలో వలస వచ్చిన రెడ్డి రెడ్డి కులస్తుల |శ్రమపోటికి తట్టుకోలేక తెలంగాణాకు వలస వెళ్ళారు. నారిలో అధిక సంఖ్యాకులు సాలి, తొగటి కులస్తులు. చెట్టు, గుట్టలు, పొదలు, రాళ్ళు, బండలు, గుండ్రతో నిండియున్న ‘ఈ భూములను సరిగ సేద్యములోనికి తెచ్చు సరికి షుమారు 50
సంవత్సరములు పట్టినది. పట్టుదలతో (శ్రమపడి నమ్ముకొనిన వారిని కూడ దెవుడు ఏ విధమున అన్ని కష్టాలను ఓర్పుతో, విశ్వాసముతో ఎదుర్కొన్న అబ్రహాము కుటుంబమును దీవించి నట్లు ఫ్లై తాళ్ళచెయివు ప్రజలను కూడ దండిగ దీవించారు. దీవించుచున్నారు.
ఇన్ని అవాంతరములను పట్టుదలతో ఎదుర్కొని, తాను తలపెట్టిన కార్యాన్ని గట్టెక్కించి దాని ఫలితాలను కండ్లారాచూచి, మనసారా ఆనందించేవారట అర్హానందస్కామి. (ప్రతి దినము రాత్రి భోజనాలు ముగించుకొని (ప్రజలంతా స్వామి వారితో తమ ఆ దిన అనుభవాలను పంచుకొనుటకు వచ్చేవారట. స్వామివారు ఆరుబైట చల్లగాలికి మెల్లామీద పొడుగాటి చుట్టకాలుస్తూ పడక కుర్చిలో పడుకుంటే, అందరూ నవ్వుకుంటూ వారు కూడ తమ దివిటీలను వెలిగించి సై సంచెలు స్వామి వారి కుర్చీ చుట్టూ పరచుకొని పడుకొని సరదాగ కబుర్లు చెప్పుకొనేవారట. ఆ దినము పొలాలలో తమ తమ అనుభవాలనుపంచుకొనేవారట. ఆ రోజులలో జొన్న పంట ఎక్కున వేసివారు.
వర్షాధార పంటలేకదా! అందులో (క్రొత్త భూమి . అందరి రైతులవలె స్వాముల వారికి కూడ పొలము, ఆవుల మంద, గేదెలు వుండేవట. పంటకాలమప్పుడు ఎవరి పొలము ఎలా పండిందో చెప్పుకొనేవారట. స్వామి కూడా వారి పొలము ఎలా పండింది అని అడిగేవారట. ఎవరైన తక్కువగా చెపితే పోవయ్యా నీకేమి తెలుసు అనేవారట. ఎక్కువగా చెప్పిన వారిని మెచ్చుకొని పెద్దగ నవ్వేవారట.రైతులు తమ పొలాలో సైరు అట్టాగే వుంచుకొని స్కాముల ; వారి పొలములో పంటపైరు కోసుకొని పోయేవారట. తెలిసికూడ స్కాములవారికి ఎవరైన చేపితే నవ్వేవారట.. పంట ఇంటికి వచ్చేటప్పటికి వేసిన అంచనా కంటే చాల తక్కువగ వచ్చేదట.
అయినా స్వాములవారు. నిరాశపడకుండా ముందటి సంవత్సరం బాగా పండుతుందనేవారట. ఆ విధముగ రైతులను కూడ నిరుత్సాహపడకుండా ప్రోత్సాహపరచేవారట. ఈవిధముగ వారు అన్ని విషయాలలో అందరికి ఉత్సాహ, |ప్రోత్సాహము కలిగిస్తూ అండగ నిలిచారు. అందరి మన్ననలు పొందారు. అందరి మనస్సులలో నిలచారు.
ఈవిధముగ తన జీవితమంతా తాళ్ళచెరువు గ్రామమునకు, ప్రజలకు అంకితము చేసి (శ్రమ చేసారు. ‘ విశ్రాంతి, విరామము ఎరుగని స్వాములవారి ఆరోగ్యము క్షీణించింది. ‘ వీపున రాచపుండు పుట్టింది. దానితో చాలాకాలము బాధపడ్డారు. చివరకు తప్పని స్థితిలో గుంటూరు డె.యం.జె, సంస్థ కన్యల ఆసుపత్రిలో చేరి స్వస్థత లేక 11-03-1927న పరమపదించారు.
ఈ విచారకర వార్త విని తాళ్ళచెరువు, పరిసర గ్రామ ప్రజల చెవిన పడగానే గగొల్లు వాపోవుతూ అనేకమంది గుంటూరు వచ్చి వారి అంత్య క్రియలలో పాల్గ్‌న్నారట. తమ గ్రామ వ్యవస్తాసకుని కోల్పోయిన గ్రామస్తులు అనేక సంవత్సరముల వరకు, ముఖ్యముగ కష్టములు వచ్చినపుడెల్చా వారిని తలంచుకొని నిలసించెడివారు. వారి ఆత్మ నిత్య విశ్రాంతికొజికు ఇప్పటికి ప్రతి కుటుంబము వారు పూజలు జరిపించు చున్నారు. వారి పేరిట ప్రతి సంవత్సరము, మే మాసములో పండుగ జరిపించుచున్నారు.
వారి విగ్రహమును కూడ గ్రామ మధ్యలో ది. 18-05-1991న నెలకొల్పి వందన, గౌరవములు సలుపుచున్నారు. వారిపేరు స్థిరస్థాయిగ ప్రతి ఒక్కరి మనస్సులో, రానున్న తరాలవారి హృదయాలలో హత్తుకొని పోవుగాక! పరలోకము నుండి అర్దానందస్వామి నిత్యము ఈ గ్రామమును వీక్షించుచు, ప్రార్చించుచు, చైవదీవెనలు జల్లుగా కురిపింతురు. గాక!