అర్లానందస్వామి సిరిపురం విచారణ చేస్తూ తమ విశ్వాసాన్ని కాపాడుకొనుటకు వలస వచ్చిన కథోలికుల ఆర్ధిక పరిస్థితి ఆస్థవ్యస్థముగ వుండుట గమనించి జాలివేసి వారికి సహాయము చేయ ఒక నిర్ణయం తో, అటవీ ప్రదేశమును సందర్శించి, పథకం వేసికొన్నారు. ఆకాలములో ఈ ప్రదేశము మద్రాసు రాష్ట్ర మేత్రాసనములో వుంది. అర్లానందస్వామి పథకం ప్రకారము మద్రాసు వెళ్ళి తమ పలుకుబడిని ఉపయోగించి అనేక సాధక, బాధలకు గురై ఈ నిర్మానుష్యమైన అటని ప్రాంతాన్ని పేద ప్రజలకు వ్యవసాయ భూమిగ ప్రభుత్వ అనుమతి మంజూరు చేయించుకొని వచ్చినారు. ఇదిగో నేను మీ నిమిత్తము ప్రభుత్వము నుండి అనుమతి పొందిన ఈ పాలు, తేనెలొలుకు “అటవీ ప్రాంతమునకు వెళ్ళి సాగుచేసుకొని భుక్తిని సంపాదించండని పిలిచిరి.

ఈ ఆహ్వానాన్ని విన్న అనేక కథోలిక, కథోలికేతర కుటుంబములు తరలివచ్చి గుడిసెలు, గుడారములు వెసికొనిరి. అర్జానందస్వాములవారు కూడ ఒక గుడారము వేసికొని అక్కడే వుంటూ వారికి అండగ ధైర్యము చెప్పుచు ప్రోత్సాహపరచు చుండెడివారు. మొదట ఇప్పుడున్న క్రొత్త సమాధులకు ఉత్తరమున వున్న పాటిచేలో గుడిసెలు వేసికొని ఉన్నారట. అక్కడ ఇప్పుడు కూడ రోళ్ళు కనిపిస్తాయి. తొలుత వచ్చిన వారిలో 40 కుటుంబములవారు సాలి, తొగటి, ఫిరంగిపురం, కొండ్రముట్ల నుండి, 6 కమ్మ కుటుంబములవారు తురకపాలెం నుండి 12 కుటుంబాల రెడ్లు, రావెల, సిరిపురం, పాటిబండల నుండి వచ్చిరి. ఇంకను కొన్ని హిందూ కుటుంబముల వారు కూడ వచ్చి చేరిరి.
ఈ భూమి చెట్టు, గుట్టలతోను, రాళ్ళు, పొదలు, బండలతో కూడిన అడవి కాబట్టి దీనిని సాగులోనికి వ్యవసాయ భూమిగ మార్చుటకు అమిత(శ్రమ చేయవలసి వచ్చెను. దేవుడు మనలను సోమరులుగ సృష్టించలేదు. సోమరితనము పిశాచికి స్థావరం వంటిది. కాబట్టి ఎప్పుడు సేద్యము, చేయని ఆభూమిని అన్ని ఆటంకాలు తొలగించి సాగులోనికి తీసికొని వచ్చుట ఊహించినంత తేలిక పని కాదాయెను. రాత్రింబవళ్ళు కష్టించి పని చేయవలసి వచ్చెను. ఆ పని అందరు చేయలేరు. విత్తనము వేయగనే పంట విస్తారముగ వస్తుందని తలంచటము అవివేకము. పండినా, పండక పోయినా భూమిని నమ్ముకొని శ్రమించే ఒక్క కర్షకునికే అది పండుతుందిగాని, భూమిలో విత్తనాలువేసి ఇంటివద్ద కూర్చున్న వానికి ససేమిరా పండదు.అదే జరిగింది ఆ రోజులలో కూడ, ఆ కాలములో పంటకాలువలు లేవు. అచ్చముగ వర్షాధారము మీద మెట్ట పైర్లు వేసికొనవలసినదే.
తొలకరి వర్షములు కురిసినప్పుడు రైతులంతా ముల్లుకర్ర చేతబట్టి పదునైనదో లేదోనని పొలము వెళ్ళితే, సాలి, తొగటీలు వలలు తీసికొని వాగులకు చేపలకు, అడవిలో కుందేళ్ళకు వెళ్ళేవారట. మరి వారికి పంటలు పండేవి కావట. పొలములో చెట్లు, గుట్టలు కొట్టివేసి, రాళ్ళు బండలు పగులకొట్టి చాల సంవత్సరములు కష్టపడవలసి వచ్చింది. చేసుకున్నవారు చేసుకున్నంత భూమి సంపాదించారు. అది అడవి ప్రదేశము కాబట్టి పశువులకు కావాల్సినంత మేత (గడ్డి) వుండేది. రైతులు సేద్యముతో పాటు, పశువులు ఆవులు, గేదెలు, మేకలు కూడ ఎక్కువగ కలిగి వుండేవారు. కొత్త ప్రదేశంలో పని సమృద్ధిగా ఉండుటచే కుటుంబములోని వారందరు వ్యవసాయ పనులతోనే, స్త్రీలు, పిల్లలతో సహా తృప్తి పడేవారు. అట్టి పరిస్టితులలో పిల్లల విద్యను గురించి ఆలోచించేవారు కాదు, అవకాశాలు కూడా లేవు.
ఈ క్రొత్త ప్రదేశములో నివసించు స్థలము పేరు తాళ్ళచెరువు గ్రామమని నామకరణము గావించబడినది. ఎందుకనగా ఈ ప్రదేశములో చాల కిక్కిరిసి, ఒత్తుగ, దట్టముగ తాటి చెట్టులు ముఖ్యముగ పడమటి కొండ ప్రాంతములోనున్న (తాటి ) చెరువునందు వుండేవట. బాగా వెడల్పుగ కొమ్ములున్న గేదె సహితము దూరలేనంత మెండుగ తాటిచెట్టు వుండేవట,ఈ కారణముచేత ఈ గ్రామమునకు తాళ్ళచెరువు అని నామమొసగ బడినది. అంత విరివిగ తాటిచెట్టులు వుండుట వలననే కాబోలు మొదట వచ్చినవారు అడవిలో వాసాలు కొట్టి తాటి ఆకుల కప్పుతో తేలికగ గుడిసలు వేసుకోగలిగినారు. తరువాత ; పాటిమట్టితో మిద్దెలు వేసికొనప్పుడుకూడ తాటి కడ్డీలు, దూలాలు వుపయోగించినారు.ఈ గ్రామము అర్జానందస్వామి అంచనా (ప్లాన్ ) ప్రకారము కటబడింది. విశాలమైన ఇండ్ల స్థలాలు, బజారులు, ఎక్కడ చూచిన నాలుగు బజారుల కలయిక, ఒక కూడలిగ అందముగా కనిపిస్తుంది. ఆ కూడలిలో వుండి చూస్తే వూరంతా కనిపిస్తుంది. అయితే కొన్ని బజారులలో పెద్దపెద్ద రాళ్ళుకూడ “భూమిలో వుండేవి. ఇప్పుడవేమి కనిపించవు లేండి. ఇప్పటి యువతకు ఈ విషయములన్ని తెలియవు
క్రమేపి కుటుంబాలు పెద్దవైనపుడు వేరుపడి అదే ఇంటిస్టలాన్నిపంచుకోవటము, బజారులు సహితము ఆ(క్రమించుకోవటం జరిగింది. తాళ్ళచెరువు గ్రామము నిర్మింపబడక పూర్వము నుండే దానికి ఉత్తర ప్రక్కన మూడు కిలోమీటర్ల దూరంలో కొత్తపల్లి అనే గ్రామముంది. ఆ (గ్రామములొనే మనసబ్, కర్ణాలు, , అనగా రెవిన్యూ అధికార్డు వుండేవారు, ఆ కొత్తపల్లి గ్రామ శివారు క్రింద చేర్చబడింది. ఈ నూతన తాళ్ళచెరువు (గ్రామము. అర్జానందస్యామి దానికి సమ్మతించక మద్రాసు వెళ్ళి తాళ్ళచెరువు శివారు క్రింద క్రొత్తపల్లి గ్రామాన్ని మార్చించినారు. తాళ్ళచెరువు (న్ధాపింపబడిన తేది ఎచ్చట ఆచూకి దొరకలేదు.
అర్లానందస్వామి పిలుపు నందుకొని తమ స్వగ్రామాలను, బంధువులను వదులుకొని ఈ నూతన ప్రదేశానికి ఎంతో ఆశతో వచ్చిన పేద కథోలికులు అనేక సమస్యలను, కష్టాలను ఎదుర్కొని, శ్రమించి పని చేయాల్సి వచ్చింది. ప్రజలు ఊహించినంత తేలికగ ఏమి జరుగలేదు. ఈ పేదలు ఈ భూములను సాగుచేసుకొనుట, పశు సంపదను పొందుట ఇరుగు పొరుగు వారికి అసూయ కలుగచేసినది. అందులో ముఖ్యముగ పాత గ్రామమైన క్రొత్తపల్లి వాసులైన “డేరా”.వంశస్తులైన బ్రాహ్మాణకులస్తులు, కర్షీకము చేస్తున్న వారికి ఆసలు గిట్టలేదు. వారికి చాల భూములుండేవి. ఈ క్రొత్తగా వచ్చిన కథోలికులను పైకి రానివ్వకుండ అనేక ఆటంకాలు, ఇబ్బందులు పెట్టేవారట.
కరణం కాబట్టి ప్రభుత్వానికి వీరిని అభివృద్దిలోనికి రానివ్వకుండ అనేక ఫిర్యాదులు చేస్తుండేవారట. ఈ కథోలికుల పశువులు పోరపాటున వారి పొలాలలోసికి వెళ్ళిన , అంచుల వరకు వెళ్ళినా తోలుకొని వెళ్ళి బందె దొడ్డల్లో పెట్టి ఇబ్బంది పెట్టేవారట. అదే విధముగ అటవీశాఖాధి కారులు కూడ అర్లానందస్వామి ఊరిలో లేనప్పుడు వచ్చి కథోలికులను వేధించేవారని చెప్పుదురు. ఇండ్లలో వున్న పశువులను కట్టివేసేటందుకు’ పాతిన కాయ్యమేకులకు సహితము ముద్రలు వేసి అడవిలో అక్రమముగా నరుకుకొసి వచ్చినవిగా అక్రమ కేసులు బదలాయించేవారట. పశువులు అడవిలోనికి వెళ్ళకపోయినను అడవి దాపులో వున్నవాటిని పుల్లరి చెల్లించలేదని బందెల దొడ్డలో పెట్టి డబ్బు గుంజుకొనేవారట. ఈ కష్టాలన్నింటిలోను అర్లానందస్వామి కథోలికులకు అండగా వుండేవారట. కేసులు పెట్టినను వారే స్త్వయముగ వెళ్లి కేసులు మాఫిచేయించేవారట. ఈ విధముగ(వ్రాయాలంటే ఇంకా ఎన్నో సంఘటనలున్నవి. మచ్చుకు మాత్రం సూచనగ కొన్ని ఉదహరించటము జరిగింది.
ఈ నూతన ప్రదేశానికి వచ్చిన పేద కథోలికులతో ఎవడు ఎల్లప్పుడు అండదండగ నిలబడి అర్లానందస్వామి నాయకత్వములో తన ప్రణాళికలో తన యందు విశ్యాసముంచిన ఈ పేద కథోలికులకు సహాయముగా నిలిచారు. సాదిoచారు.
Source : From the book of “మా ఊరు తాళ్ళచెరువు” in 1996 by ఫాదర్ ఏరువ ఇన్నయ్య