1957 జూన్‌ నుండి సెప్టెంబరు 1967 వరకు అల్లం జ్ఞానయ్య స్వామి విచారణ గురువుగ పని చేసారు. వీరు కథోలికుల జీవితములో చాల మార్పు తెచ్చారు. వారు దేవాలయములో ఎక్కువ సమయం ప్రార్రనలో గడిపేవారు. ఉపవాసములుండేవారు. వీరి కాలంలో తాళ్ళచెరువులో మొట్టమొదటి గురువులు ఏరువ ఇన్నయ్య స్వామి, పూదోట ఇన్నయ్య స్వామి, నెల్లూరులో ది.08-12-1958న గురుపట్టాభిషేకం పొంది, ది. 11-12-1958న ప్రథమ పూజను తాళ్ళచెరువులో సమర్సించిరి. వీరిరువురే వారి గుర్గు పట్టాభిషేకమునకు ముందు మిల్‌హీల్‌ సంస్థ గురువుల ద్యారా హాలండు దేశము నుండి.అర్లానందస్యామి బంధువుల నుండి వారి పొటోలు, సమాచారం స్వీకరించి అల్లం జ్ఞానయ్య స్వామికి ఇవ్వడము జరిగింది.

తాళ్ళచెరువులో క్రిస్‌మస్‌ పండుగరోజు జరిగే తేరు ప్రదక్షిణ విధానము ససేమి నచ్చలేదు. స్వామివారు బాణసంచాలు, గోల లేకుండా జపములతో, పాటలతో ప్రదక్షిణ జరపాలనేవారు. ప్రజలకు అధినచ్చలేదు. ఒప్పుకొనలేదు.సంవత్సరమునకు ఒకసారి వచ్చు పండగ, చుట్టు ప్రక్కల గ్రామముల నుండి అనేకమంది క్రైస్తవులు, హిందువులు, సంబరము చూడాలని వస్తారు. మందులు, మేళము లేకుంటే చప్పుగ వుంటుంది. ఇతరులు ఎవరురారు. మరి మత ప్రచారము ఎలా జరుగుతుంది అన్నారు గ్రామస్తులు. అయితే ఫాదరు గారికి నచ్చలేదు.చేసేదిలేక ఊరక వున్నారు.

అర్లానందస్వామి ఫొటొ చరిత్ర స్వీకరించిన జ్ఞానయ్యస్వామి ఆరోజు లలో ఉపదేశిగ పని చేస్తున్న ప్రసిద్ద బుర్ర కథకుడు సాధు తోమాసు సుబ్బయ్య గారిచే అర్లానందస్వామి చరిత్రను బుర్రకథగా వ్రాయించారు. అర్లానందస్వామి ఫొటోను యేరువ అర్హారెడ్డిగారు ఇచ్చిన విరాళముతో పెద్ద ఫొటోగా పెయింట్‌ చేయించి గురువులుండే బంగళా వరండాలో పెట్టారు.అర్లానందసన్వామి ఫొటో చాల కాఫీలు తీయించి ప్రతి ఇంటికి పంచారు. కొంత మంది చట్టాలు కట్టించి ఇప్పటికి ఇండ్లలో పదిలముగ తగిలించారు.

ప్రతి సంవత్సరము మే నెలలో భక్తియుతముగ, పండుగరోజు ఉదయం పూజ, జపతపములతో (ముందుగ వడకముతో) దేవునికి స్తోత్రములు తెలుపుకుంటూ, సాయంత్రం ప్రొద్దు కూకకముందే గ్రామములో అర్లానంద స్వామి ఫొటోతో తేరు ప్రదక్షిణ, బాణ సంచాలు లేకుండా అర్లానంద స్వామి పేరపండుగ ఏర్పాటు చేయడమైనది. ప్రజలందరు దానిలో సంతోషముతో జపములతో, పాటలతో పాల్లొనెడివారు. సాయంత్రం అర్లానందస్వామి బుర్రకధ, మరియు సాంస్కృతిక కార్యక్రమములు జరిపెడివారు. ఈ పండుగ ముఖ్యముగ ఆ గ్రామము నుండి ఆయిన గురువులు, కన్యాస్రీలు పాల్గొనుటకు విలుగ అనుకూల తేదీ యందు నిర్ష్హయించెడి వారు. ఎందుకనగా తాళ్ళచెరువు స్వగ్రామమైన గురువులు, కన్యాస్రీలు క్రిస్‌మస్‌ పండుగకు వచ్చుటకు వీలు పడదు గనుక ఈ పండుగలో పాల్తొనుటకు అవకాశము కలుగచేసేవారు. వీరు ది.10- 06-1985న గుంటూరు జె.యం.జె కన్యల ఆసుపత్రిలో మరణించారు. వారి కోరికపై తాళ్ళచెరువు లూర్జ్హుమాత గృహ వద్ద భూస్టాపితము చేయబడ్డారు.

తరువాత జూన్‌ 1968 నుండి ఏఫ్రియల్‌ 1973 వరకు వట్టి అర్హయ్య స్వామి విచారణ కర్తలుగ పనిచేశారు. జ్ఞానయ్య స్వామి తరువాత ముందే సహాయ గురువుగా వుంటున్న అల్లం పాపయ్య స్వామి 1965లో అచ్చంపేటకు రోడ్డువేస్తూ తాత్కాలిక విచారణ గురువుగ సెప్టెంబరు 1967 నుండి జూన్‌ 1968 సి.ఆర్‌.యస్‌. వారి సహయముతో ‘పనికి ఆహారము” పథకము క్రింద డొంకలకు మట్టిపోయించి మట్టిరోడ్డు వేయుట ప్రారంభించారు.వట్టి అర్హయ్య స్వామి కూడ ఈ పథకాన్ని కొనసాగించారు. వీరి కాలంలో యేరువ జార్జి స్వామి ది.22-12-1969న తుమ్మా జోసెఫ్‌ స్వామి 20-12-1971 గురుపట్టాభిషకములు జరిగినవి. అర్హయ్యస్వామి గురుపట్టాభిషేక రబిత జాబిలి కూడ 21-12-1969న తాళ్ళచెరువు కథోలికులు ఘనముగ జరిపారు. యేరువ ఇగ్నేషియస్‌ స్వామి ఏప్రియల్‌ 1973 నుండి జనవరి 1978 వరకు తాళ్ళచెరువు విచారణ గురువుగ పనిచేసియున్నారు. వీరు చాల సాంఘిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు. వీరి కాలంలో తాళ్ళచెరువులో సి.ఆర్‌.యస్‌ వారి సహాయముతో రోడ్డు బాగా వేయించారు.ది.21-02-1976న పాల ఉత్పత్తి దారుల సహకార సంఘము వచ్చినది 15-03-1980న బిల్లింగు నిర్మించటము, పై అంతస్తు 15-08-1990న నిర్మించటము జరిగినది. గ్రామ పంచాయితి బాగుగ పనిచేయటం ప్రారంభించింది. ,అప్పుటి గోపు శౌర్రెడ్డి యం.పి. గారు ఆర్‌.టి.సి బోర్డు మెంబరుగారి పలుకుబడితో తాళ్ళచెరువుకు ఆర్‌.టి.సి. బస్సు 1973 నుండి వేయించారు. అదే సంవత్సరము అనగా 1973లో కరంట్‌ వచ్చుటకు కూడ చాల కృషిచేసి సాధించారు. 1975లో అన్నమ్మగారి సభ సిస్టర్తుతో సంప్రదించి ఆప్పత్రి పెట్టించారు. ఇకపోతే 1976లో మాదిగ పల్లిలో ప్రాథమిక పాఠశాల ఏర్పరచినారు. 1975 నుండి [గ్రామములో టెలిఫోను సౌకర్యము కూడ ఏర్పడింది.

జనవరి 1978 నుండి 22-05-1980 వరకు పెంటారెడ్డి మరెడ్డి స్వామి తాళ్ళచెరువు విచారణ గురువుగ వుండిరి. వీరి కాలములో అంతకు ముందెప్పుడో పడిపోయి రిపేరు చేయబడి గానుగ సున్నముతో, తార్బ్చతాటికడ్డిలతో, దూలాలతో ఎత్తుగ వుండిన జాక్‌రూప్‌ గల స్వాముల వార్ల బంగళాను ప్రస్తుతము వున్న విధముగ ఎత్తు తగ్గించి మేత్రాసన సహాయంతో ఆర్‌సి.సి స్లాబ్‌ కప్పు వేయించారు. వీరు గుండెపోటు వలన 22-05-1980న గుంటూరు నగరంపాలెం బంగళాలో ఏదో పనిమీద వచ్చి నిద్రలోనే మరణించారు. వీరి స్వగ్రామమైన శిరిపురంలో భూస్టాపితం చేసారు.

తదనంతరము దుగ్గింపూటి కిరీటి స్వామి ఆగష్టు 1980 నుండి సెప్టెంబరు 1985 వరకు విచారణ స్వాముల వారుగ నుండిరి. రికాలంలో మేత్రాసన ఆర్టిక సహాయంతోదేవాలయం పెంకు కప్పు తీసివెసి,కథోలికుల సంఖ్య ఎక్కువైనందున చాలిచాలని గుడి చెవ్వు కట్టను పొడిగించి ఆర్‌సి.సి. స్టాబ్‌ వేసి గుడిలో పాలిష్‌ రాళ్ళువేయించి దేవాలయాన్ని క్రొత్తహంగులతో సరిక్రొత్త పీఠముతో రూపు దిద్ది మరల దేవాలయ ప్రతిష్టోత్సవము గాలిబాలి ఏలినవారితో జరిపారు. వీరు గ్రామ మధ్యలో 18-05-1982 న తిరు కుటుంబ స్వరూపమును గంజి ఇన్నారెడ్డి జ్ఞాపకార్హం స్టాపించారు. విరి ప్రోద్దలము వలన 13-06-1983 నుండి సిస్టర్హు పునిత అన్నమ్మగారి హైస్కూలు బాల, బాలికల కొజుకు ప్రారంభించిరి. పంటలు బాగా పండుచున్నందున గ్రామస్థులు తమ పూర్వపు మట్టి మిద్దెలు పడవెసి పక్కా భవనములు స్టాబులు వేసి నిర్మించసాగిరి. ప్రభుత్వమువారు పేదలకు క్రొత్తకాలనీలు, పక్కా ఇండ్డు కట్టింపసాగిరి. 23-07-1983న తాళ్ళచెరువు ‘వైతన్య గ్రామిణ బ్యాంకు పెట్టిరి 11-12-1983న ఏరువ ఇన్నయ్య స్వామి
తమ గురుపట్టాభిషేక రజిత జూబిలీని దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నిరాడంబరముగ దివ్యబలిపూజ సమర్పించిరి. కిరీటి స్వామి అప్పటి వరకు తాళ్ళ చెటువులో పనిచేసిన గురువుల ఫొటోలను స్వీకరించి గురువుల బంగళాలో స్టాపించారు.

గోలి అంతయ్య స్వామి సెప్టెంబరు 1985 నుండి జూన్‌ 1988 వరకు విచారణ గురువుగ వుండిరి. విరు మేత్రాసన ఆర్జిక సహాయముతో బాలుర హాస్టల్‌ బిల్లింగు 28-10-1989న నిర్మించిరి. వీరి కాలంలో రేపూడి రాయప్ప స్వామి 30-04-1986న గంజి రాజారెడ్డి స్వామి 04-05-1987న గురుపట్టాభిషేకం పొందిరి. 10-12-1986న తాళ్ళచెరువు ప్రజలు అంతయ్య స్వామి గురుపట్టాభిషేక రజత జూబిలీని ఎంతో ఘనముగ జరిపిరి.

పిమ్మట వట్టి ఇన్నయ్య స్వామి జూన్‌ 1988 నుండి జూన్‌ 1992 వరకు విచారణ గురువుగ పనిచేసారు. పంటలు బాగ పండుచున్నందువలన రైతులు మంచి ఇండ్లు కట్టుకొనుచుండిరి. గ్రామ జనాభా పెరుగుట వలన గ్రామము తూర్పు, దక్షణం, ఉత్తర దిశలగా అంతులేనంత పెరిగిపోయింది. గ్రామ పటము గుర్తుపట్టలేనంత విధముగా మారిపోయింది. అన్ని రంగాలలో అభివృద్ది పొందింది. 18-05-1991న అర్లానందస్వామి విగ్రహాన్ని గంజి “పెద్ద శౌరెడ్డి శ్రమపడి దాతల వద్ద నుండి విరాళాలు స్వీకరించి గ్రామము మధ్యలో అతివైభవముగా స్టాపించారు.

జూన్‌ 1992 నుండి 1996 వరకు పుట్టి సుందరరాజు స్వామి విచారణ గురువులుగ పనిచేసారు, తాళ్ళచెరువు గ్రామ నిర్మాణ శత వత్సరములు పూర్తి చేసుకున్న సందర్భమున ఏరు మెత్రాసన, గ్రామ ప్రజల ఆర్టిక సహాయముతో దేవాలయ గోపురము, డోము రిపేరు చేసి, తలుపులు, కిటికీలు క్రొత్తవి పెట్టించి మరియొకసారి దేవాలయమునకు క్రొత్తరూపు తెచ్చారు. మేత్రాసన ఆర్థిక సహాయముతో బాలుర హాస్టలుకు రెండవ బిల్లింగు నిర్మించారు. 27-05-1993న గుంటూరు మేత్రాణులు గాలిబాలి గారు, విజయవాడ మేత్రాణులు తుమ్మాజోసెఫ్‌గారు, వరంగల్‌ మేత్రాణులు తుమ్మా బాలగారు, అనేక మంది గురువుల, కన్యా స్త్రీల, బంధుమిత్రుల,ఆ గ్రామము నుండి తరలి వెళ్ళిన మిత్రుల సమక్షములో అనేక కార్యక్రమములతో ఎంతో గొప్పగ శత వార్షికోత్సవము జరిపారు. రెండు ప్రక్కల సమాధుల దొడ్డికి ప్రహారీ గోడ మేత్రాసన, గ్రామస్తుల ఆర్థిక సహాయముతో నిర్మించిరి. బలిపీఠం తుమ్మా ప్రాంచీసు రెడ్డి గారి జ్ఞాపకార్హం నిర్మించబడినది. ది. 19-11-1994న ప్రారంబోత్సవము జరిపారు.

గ్రామములో పేదలకు మేత్రాసన సహాయముతో కొన్ని గృహములు నిర్మించిరి. ఎన్నియో సంవత్సరముల నుండి అడుగున పడిన కాయిదా పునరుద్దరింపబడెను. రక్షిత మంచినీటి పథకమును ప్రభుత్వ, మెత్రాసన ఆర్థిక సహాయముతో అమలు పరచటము జరిగింది. ఏప్రియల్‌ 1996 నుండి మంచినిటి సరఫరా కొద్దిగ ప్రారంభమైనది.