గుంటూరు పొతకమూరి తోమాసు మేత్రాణులు, తాళ్ళచెరువు విచారణ కర్త తిప్పరమల్లి మరియన్నస్వామి ఆహ్వానమును పురస్కరించుకొని పునీత అన్నమ్మగారి మఠకన్యలు, ఫిరంగిపురం వారు తాళ్ళచెరువు గ్రామములో ది.13-01-1941న పునీత జోజప్పుగారి మఠము స్టాపించిరి. స్థాపించిన మొదటి నుండి అంతకుముందే గుడి ఆవరణలో మేత్రాసన ఆధీనములో నడుపబడుచున్న ప్రాథమిక పాఠశాలను సిస్టర్సుకు ఒప్పజెప్పిరి. ఇంకా దానికి పూర్వము పూదోట అమృతయ్యగారు గ్రామములో పాఠశాలను నిర్వహించుచుండెడివారు.

ఈ పాఠశాల సెంట్‌మేరీస్‌ ఆర్‌.సియం. ప్రాథమిక పాఠశాలగా పిలువబడుచున్నది. మొదటి పెద్దమ్మగారు, ప్రధానోపాధ్యాయిని గాలి బ్రిజీతమ్మగారు (చెజుకుంపాలెం) నియమించబడిరి. వీరు చాల తెలివి, నైపుణ్యములతోను, పాటలతోను, హార్మోనియం చక్కగా వాయించటము వలన గ్రామస్తుల అభిమానమును పొందిరి. వీరి కాలంలో పాఠశాలకు పిల్లలను బాగా రాబట్టగలిగిరి. కష్టపడి బోధించెడివారు.

మొదట పాఠశాల ప్రస్తుతము లూర్ద్జుమాత గృహవద్ద నుండి ఉత్తరపు ప్రహరిగోడ మీద చాల పొడవుగా తాటిదూలాలు, కడ్డీలు, రెల్టుగడ్డి కప్పిన బారకాస. దానిలోనే ఐదు తరగతులు నిర్వహించేవారు. అందరు అమ్మగార్లే బోధించెడివారు. టీచర్జు లేరు. దానిని ఆనుకొని తూర్పున అమ్మగార్ల వసతి గృహము నాటు పెంకుతో కప్పు వేయబడిన ఇల్లు ఉందేది; అప్పటి సిస్టర్సు చాలా కష్టపడి పనిచేసేవారు. బడిలో బోధనే కాకుండా, ఇంట్లో పనులు, వంట పనులు వారే చూసుకొనేవారు. పొలము పనిమీద నున్న ఆసక్తి ప్రజలకు ఆ రోజులలో చదువుమీద లేదు. పొలములో పెద్దవారికి, పిల్లలకు కావలసినంత పని ఆ పరిస్టితులలో తిప్పరమల్లి మరియన్నస్వామి, అమ్మగార్హు ముఖ్యముగ బ్రిజీతమ్మగారు విద్య యొక్క ఆశ్యకతను ప్రజలకు నచ్చజెప్పి క్రమేపి ప్రజలకు విద్యమీద ఆసక్తిని పెంపొందింపజేసారు. కాబట్టే ఆ రోజులలోనే తాళ్ళచెరువు నుండి 50, 60 మంది బాల బాలికలు ఫిరంగిపురం,గుంటూరు, కృష్ణాజిల్హాలోని నందిగామ ఉన్నత విద్య కొజకు వెళ్ళేవారు. అప్పటి నుండి ప్రజల ఆలోచన విధానములో మార్పు వచ్చి పిల్లలను చదువుకు పంపుట మొదలు పెట్టారు. అంతకు ముందు ప్రజలు పిల్లలు చదువుకొని ఏమి ఉద్యోగము చేస్తారు. ఎవరి క్రిందో జీతగాడి మాదిరి జీతానికి ఉద్యోగము చేయుటకంటే మన పోలములోనే స్వేచ్చగా పనిబేసీ సంపాదించి పది మందికి పని కల్పించ వచ్చుగదా!

తాళ్ళచెరువును గురించి మంచి అభిప్రాయములేని ఇతర గ్రామ కథోలికులకు వారితో ‘వచ్చిచూడుము’ అని చెప్పకుండనే మారిన తాళ్ళచెరువు పరిస్థితిని చూచి వెతుక్కుంటూ వచ్చి వివాహములలో ఇచ్చి, పుచ్చుకుంటున్నారు. చూచారా! ఒకనాడు తక్కువ అంచనా వేయబడిన శ్రమజీవుల గ్రామమైన తాళ్ళచెరువు జొన్నత్యము ఎంతగా పెరిగిందో! ఎవరేమనుకున్న కష్టంలోనే వుంది ఫలితం. శ్రమలోనే వుంది గౌరవం ఆనందం, వారియందే వుంటాయి దైవాశీస్సులు. సిస్టర్డు వుంటున్న తాత్కాలికముగ కట్టిన పెంకుటింటిలో వసతులు సరిగలేక బాధపడుచుండిరి. అప్పటి విచారణ గురువుల ద్వార సిస్టర్డు ముమ్మడి ఇగ్నేషియస్‌ ఏలినవారికి వారి బాధలు తెలుపగా వారు 1944 సంవత్సరములో సిస్టర్సు వసతి గృహము నిర్మించుటకు దగ్గరవున్న ఎ.7:56 సెంట్ల చేలో ప్రస్తుతము హైస్కూలు కట్టిన దానిలో రెండు ఎకరములు కేటాయించిరి. అయితే తెలివిగల సిస్టర్సు దానిని అలాగే వుంచి 1947 సంవత్సరములో ఇప్పుడున్న మేడ గుడి ఆవరణలోనే ప్రజల సహకారముతో నిర్మించిరి. దీనికి కూడ ప్రజలు ఎంతో ముందుకు వచ్చి శ్రమదానం అంతా ఉచితముగా చేసి సహాయపడిరి. పాఠశాల ఆ పెద్దవూరి బారకాసలోనే వుంది. వీరు కాన్వెంటు రజిత జూబిలి 1966 సం॥లోను, స్వర్ణజూబిలి 1991 జరిపినారు.

అది 1952వ సంవత్సరము ఆ రోజు దిపావళి పండుగ. బడికి సెలవు. సిస్టర్టు ఇంటిలోనే వున్నారు పిల్లలు కొంత మంది వచ్చి బడి వద్ద ఆడుకుంటున్నారు. అందులో ఒక బాలుడు టపాసు కాల్ఫి పైకి విసిరాడు. అది కాలుకుంటూ బడి పూరికప్పుమిద పడింది. అది రగుల్కొని కొద్ది క్షణములో పెద్ద మంటై ఆ బడిపాక అంతా బూడిదైనది. ప్రజలంతా పొలములో వెరుశనక్కాయలు కొయించుకొనే పనిమీద యున్నారు. మంటలు చూచి పొలములోని ప్రజలు పరుగెత్తుకుంటూ వచ్చేసరికి అంతా అయిపోయింది. ఆ విధంగా పెద్ద దీపావళి జరిగింది.

అప్పటికి నిర్మాణములో నున్న ప్రస్తుత ప్రాథమిక పాఠశాల కట్టుబడి త్వరగ పూర్తిచేసి దానిలో ఇప్పటి వరకు పాఠశాల తరగతులు జరుపబడుచున్నవి. ఈ పాఠశాల నిర్మాణములో కూడ గ్రామస్తులు తమ వంతు శ్రమదానము చేసి సహకరించారు. ప్రస్తుతము ఈ సీమ పెంకు కప్పు పాఠశాల దూలాలు, కడ్డీలు వంగి, వర్షానికి కారటము, ఎప్పుడు కూలుతుందా అని భయపడవలసి వచ్చింది. కానుకమేరి పెద్దమ్మగారు ఈ పరిస్థితి గాలిబాలి ఏలినవారి దృష్టికి తీసికొనిరాగా వారు జర్మనిలో ఒక సంస్థకు వ్రాసి ఆర్థిక సహాయాన్ని అందజేసారు. దానికప్పు తీసి ఆర్‌.సి.సి. స్టాబ్‌ వేయుటకు ఏప్రియల్‌ 1996 నుండి ప్రయత్నము చేసి త్వరగ పని పూర్తిచేసినారు. జూన్‌ 1996 నుండి నూతన పరచిన పాఠశాలలో తరగతులు జరుగుచున్నవి.

డిస్పెన్సరీ (ఆసుపత్రి)

అనారోగ్యకారణాలవల్ల చిన్న జబ్బులకు కూడ మందులిచ్చే వారు లేనందున ప్రజలు బాధపడుచున్నందున ప్రజల విజ్ఞప్తి మేరకు అప్పటి విచారణ గురువు యేరువ ఇగ్నేషియస్‌ స్వామి పెద్ద మదరుగారికి విషయాన్నితెలియపరిచినారు. పెద్దమదరుగారు అంతా పరిశీలించి ది.20-2-1975లో స్వాములవారి వంటగదిలో ప్రక్కన కొద్ది రేకుల షెడ్డువేసి దానిలో తాత్కాలికముగా పునీత శౌరివారి ఆసుపత్రిని మాజి గుంటూరు మేత్రాణు లైన ముమ్మడి ఇగ్నేషియస్‌గారు ప్రారంభించిరి. రెండు సంవత్సరముల తరువాత అంతకు ముందే సిస్టర్సు ఇల్టు కట్టుకుంటామని తీసికున్న రెండు ఎకరములలో ఆస్పత్రి బిల్లింగు కట్టించి ఈ వంటిల్లు ఖాళీచేస్తామన్నారు. స్వాములవారికి వంటిల్లు లేనందున ఈ రెండు సంవత్సరముల వరకు
సిస్టర్సు స్వాముల వారికి నెలసరి డబ్బు తీసికుంటూ భోజనము పంపుదు మన్నారు. ఆస్పత్రి చాలా బాగుగా సాగింది. ప్రజలు సంతోషించారు.అయితే సిస్టర్సు అప్పులిచ్చారు. అవి సకాలములో వసూలు కాక కొంత బాధపడ్డారు. చివరకు అందరు బాకీలు చెల్లించారు. 15 సంవత్సరములు గడచినా ఆస్పత్రి బిల్లింగు కట్టించలేదు.’ ఏదో కొద్దిపాటు నెపాలుమోసి ఎంత (బ్రతిమాలినను వినక ఆస్పత్రి 1990 ఆగష్టులో మూసి వేసారు. ప్రజలు ప్రతి చిన్న జబ్బులకు బాధపడవలసివస్తుంది. సిస్టర్టు ఇల్టు కట్టించుకుంటామని తీసికున్న రెండు ఎకరాలలో ఇల్టు కట్టించుకొన లేదు. తరువాత ఆస్పత్రి కట్టించుకుంటామని ఆ స్థలములో అదీ కట్టించలేదు. గ్రామ ప్రజలు ఆస్పత్రి పెట్టమని వత్తిడి. తెస్తేగాని పెట్టరు.